NationalNewsNews Alert

సోనియా గాంధీ ఈడీ విచారణ పూర్తి

Share with

నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈడీ విచారణ ముగిసింది. దీంతో ఈడీ కార్యాలయం నుంచి సోనియా గాంధీ బయటకు వచ్చారు. ఈ కేసులో సోనియాను ఇప్పటి వరకు ఈడీ 3 రోజులు విచారించింది. మొత్తం 12 గంటల పాటు సోనియాను ప్రశ్నించింది. మరోసారి హజరు కావాలని సోనియాకు తాజాగా ఈడీ ఎలాంటి సమన్లు జారీ చేయలేదు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి సోనియా గాంధీని ఈడీ అధికారులు తొలిసారి ఈ నెల 21వ విచారించారు.

మరోవైపు, ఈ కేసులో రాహుల్, సోనియా వద్ద ఈడీ అధికారులు విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దేశ వ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు చేస్తున్న విషయం తెల్సిందే. దీంతో ఢిల్లీలోని ఈడీ కార్యాలయంతో పాటు ఏఐసీసీ కార్యాలయం వద్ద భారీ సంఖ్యలో పోలీస్ బలగాలను మొహరించారు.ఇందులో భాగంగా పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన కాంగ్రెస్ ఎంపీలను, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంట్ సమీపంలోని విజయ్ చౌక్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే 65 మందిని ఎంపీలను ఢీల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మాణికం ఠాగూర్ ఆరోపించారు. గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకెళ్తున్నారని ఠాగూర్ ట్వీట్ చేశారు. మరోవైపు సోనియా గాంధీని ఈడీ ప్రశ్నించినందుకు నిరసనగా రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సచిన్ పైలట్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకోవడానికి బ్రూట్ ఫోర్స్‌ను ఉపయోగించారని, ఢిల్లీ పోలీసులతో జరిగిన ఘర్షణలో పలువురు పార్టీ కార్యకర్తలు గాయపడ్డారని ఆయన ఆరోపించారు.