NewsTelangana

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వస్తున్నారన్న బండి

Share with

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి రాబోతున్నారన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. కోమటిరెడ్డి ప్రస్తుతం కార్యకర్తలతో సమావేశం అయ్యారని… తన నిర్ణయాన్ని పార్టీ కార్యకర్తలతో చర్చిస్తున్నారని చెప్పారు సంజయ్. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నందున రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతున్నారన్నారు. పార్టీలోకి వచ్చే నాయకుల గురించి ముందు ముందు మీడియాలో వెళ్లడిస్తామన్న సంజయ్… అందుకు కార్యాచరణ సిద్ధమయ్యిందన్నారు. ముఖ్యమంత్రి ఫార్మ్ హౌస్‌లో పడుకుంటున్నారని… ఇక్కడే ముఖ్యమంత్రి ఎవరినీ కలవడం లేదని… ఢిల్లీ వెళ్లి ఎం చేస్తారన్నారు.