మాదాపూర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య
హైద్రాబాద్ మాదాపూర్లో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఏకంగా 13 అంతస్థుల పై నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకున్నాడు. నవీన్ రెడ్డి అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి గురువారం ఉదయం సూసైడ్ చేసుకున్నాడు. మైండ్ స్పేస్ భవన్ లో 13వ అంతస్థుకు వెళ్లి అక్కడ నుంచి కిందకు దూకాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

