క్రికెట్ మైదానాన్ని కప్పేసిన మంచు
ఇండియాలో కాకుండా ప్రపంచ దేశాలల్లో చలి పులి పంజా విసురుతోంది. బ్రిటన్‌లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. లండన్‌లో మైనస్ 10 నుంచి మైనస్ 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. విపరీతమైన మంచు కురుస్తోంది. ఈ క్రమంలో ప్రఖ్యాత ఓవల్ మైదనాన్ని రెండు అడుగుల మేర మంచు కప్పేసింది. మంచు దుప్పటిలో ఓవల్ మైదానం వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి నెటిజన్‌లను ఆకట్టుకుంటున్నాయి. దీన్ని చూస్తే క్రికెట్ గ్రౌండ్ అని ఎవరూ అనుకోరని కొందరు అంటున్నారు. ఓవల్ మైదానంలో క్రికెట్‌కు బదులు ఐస్ హాకీ ఆడుకోవచ్చని పలువురు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. 1845 లో ఓవల్ మైదానాన్ని నిర్మించారు. ఈ స్టేడియంలో 23,500 మంది మ్యాచ్‌ను వీక్షించవచ్చు. 1880లో ఇక్కడ తొలి టెస్ట్ మ్యాచ్ నిర్వహించారు. అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చిన రెండో మైదానంగా ఓవల్ గుర్తింపు పొందింది.

