Home Page SliderNational

కమర్షియల్ యాడ్‌లో మెరిసిన ఘట్టమనేని వారసురాలు సితార

సూపర్‌స్టార్ మహేష్ బాబు కూతురు ఘట్టమనేని సితార కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఓ జ్యువెల్లరీ షాప్‌కు సంబంధించిన యాడ్‌లో సితార నటించారు. అయితే ఈ వాణిజ్య ప్రకటనను ఇవాళ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ప్రదర్శించారు. కాగా ఈ వీడియోను మహేహ్‌బాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు. నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. ఇలానే నన్ను అబ్బురపరుస్తూనే ఉండాలి అని పోస్ట్ చేశారు. ఇది చూసిన మహేష్ బాబు ఫ్యాన్స్ తండ్రికి తగ్గ కూతురు అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.