వివాహానంతరం సింధు శుభారంభం
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇటీవలే వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహానంతరం మొదటిసారిగా ఆమె ఇండియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో పాల్గొంది. ఈ పోటీల్లో మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో చైనీస్ క్రీడాకారిణి యున్ సుంగ్‌పై 21-14, 22-21తో విజయం సాధించి శుభారంభం చేసింది. కేవలం 51 నిమిషాల్లో ప్రత్యర్థిని ఓడించి ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. ఆమె ఆటలో వేగం, శక్తి జోడిస్తే మరింత ఉన్నత స్థాయికి చేరుకోగలదని ఆమె కొత్త కోచ్ ఇర్వాన్ సియా తెలిపారు.

