“వరుస కేసులతో మమ్మల్ని సర్కస్ ఆడిస్తున్నారు”:సిద్ధార్థ్ లుథ్రా
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ప్రస్తుతం చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతుంది.ఈ నేపథ్యంలో చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లుథ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. స్కిల్ స్కామ్ కేసు విచారణకు ఫైబర్ నెట్ కేసుతో సంబంధం ఉంది అన్నారు. అయితే మరో కేసులో చంద్రబాబును 16న కోర్టులో ప్రవేశపెట్టేందుకు వారెంట్ తీసుకున్నామన్నారు. ఈ విధంగా కేసులు మీద కేసులు పెట్టి మమ్మల్ని సర్కస్ ఆడిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే సుప్రీంకోర్టులో 17A ను మీరు ఛాలెంజ్ చేస్తున్నారా?అని జడ్జ్ సిద్ధార్థ్ లుథ్రాని ప్రశ్నించగా ఆయన అవును అని సమాధానం ఇచ్చినట్లు తెలిపారు.

