నెటిజన్లకు శ్రుతి హాసన్ సమాధానాలు
Shruti Haasan Health శ్రుతి హాసన్ ప్రస్తుతం వెదర్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఆమె ముంబైలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. గత రెండు మూడు రోజుల నుంచి ఫ్లూతో శ్రుతి హాసన్ బాధపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నట్టుగా కనిపించింది. దీంతో ఆమె సరదాగా ఇలా ఫ్యాన్స్‌తో చిట్ చాట్ సెషన్ పెట్టింది. ఈ క్రమంలో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. డిప్రెషన్ నుంచి బయటపడే సలహాలు చెప్పింది.. తన ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చింది.
శ్రుతి హాసన్‌కు ప్రస్తుతం కాస్త అనారోగ్యం ఉంది. ఈ వెదర్‌కి ఆమెకు ఫ్లూ సోకినట్టుగా ఉంది. అయినా ఈ వెదర్ బాగుందని, తనకు చాలా నచ్చిందని, అందుకే ఇలా ఇంట్లో చిల్ అవుతున్నట్టుగా చెప్పేసింది. ఈ క్రమంలో దొరికిన ఈ ఖాళీ టైంలో ఇలా తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఫ్యాన్స్, ఫాలోవర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. నువ్వు సింగిల్? నా గర్ల్ ఫ్రెండ్‌లా ఉంటావా? అంటూ ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగేశారు. వాటికి కూడా శ్రుతి హాసన్ సమాధానం ఇచ్చింది.నీ ఆరోగ్యం ఎలా ఉంది? అని ఓ నెటిజన్ అడిగాడు. దానికి శ్రుతి హాసన్ సమాధానం ఇచ్చింది. ఫ్లూ వచ్చింది.. కాస్త పర్లేదు ఇప్పుడు.. బాగానే ఉన్నాను అంటూ క్లారిటీ ఇచ్చింది. నువ్వు సింగిలేనా? అని మరో నెటిజన్ అడిగాడు. ఏ ఎందుకు? అన్నట్టుగా శ్రుతి హాసన్ రివర్సల్‌లో ప్రశ్నించింది. నా గర్ల్ ఫ్రెండ్‌గా ఉంటావా? అని ఇంకో నెటిజన్ అడిగితే.. నో అని చెప్పేసింది. ఇలా నెటిజన్లు రకరకాల ప్రశ్నలు సంధించారు.మళ్లీ తెలుగులో ఎప్పుడు కనిపిస్తావ్? అని ఓ నెటిజన్ అడిగాడు.. గత ఏడాదే కదా మూడు సినిమాలతో ఆడియెన్స్ ముందుకు వచ్చా.. ఇదేం పిచ్చి ప్రశ్న.. వింత ప్రశ్న.. అసలు నువ్వేం అడుగుతున్నావ్ అంటూ చెప్పేసింది. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావ్ అని అడిగితే.. చెన్నై, హైద్రాబాద్, ముంబై అంటూ తిరుగుతూనే ఉన్నానని, షూటింగ్‌లతో బిజీగా ఉంటున్నానని తెలిపింది. డిప్రెషన్ నుంచి బయట పడాలంటే ఎలా? ఏమైనా సలహాలు ఇవ్వండి అని శ్రుతి హాసన్‌ను ఓ నెటిజన్ అడిగారు. మనకు ఏ సమస్య ఉన్నా, ఎదురైనా కూడా నోరు విప్పి మాట్లాడాలి.. మన కోసం మనం ధైర్యంగా నిలబడాలి.. డిప్రెషన్ నుంచి బయట పడటం అంత ఈజీ కాదు కానీ.. మనో ధైర్యంతో ముందుకు సాగాలి.. అంటూ శ్రుతి హాసన్ సలహాలు ఇచ్చింది. శభాష్ నాయుడు గురించి కూడా మాట్లాడింది. ఆ సినిమా మధ్యలోనే ఆగిపోవడం గురించి స్పందించింది. నాన్నతో కలిసి ఎప్పటికైనా ఓ సినిమా చేయాలని అనుకుంటున్నట్టుగా చెప్పుకొచ్చింది.

