తెలంగాణతో పాటు ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలివే…
తెలంగాణలో త్వరలోనే ఎన్నికల నగారా మోగనుంది. అయితే తెలంగాణతో పాటు మరో కొన్ని రాష్ట్రాలలో కూడా ఎన్నికలు జరుగనున్నాయని తెలుసా.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మిజోరాం లలో కూడా ఈ నెల (అక్టోబర్ ) 8 నుండి 10 వతేదీలోపుగా ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశముంది. నవంబర్ నుండి డిసెంబర్ తొలివారం లోపు పోలింగ్ తేదీలను ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది. డిసెంబర్ 15తేదీలోపల ఫలితాలు కూడా వెలువడే అవకాశం ఉంది. ఛత్తీస్ ఘడ్‌లో మాత్రం రెండు విడతలలో పోలింగ్ నిర్వహస్తే, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాంలలో ఒకే విడతలో పోలింగ్ జరగవచ్చని భావిస్తున్నారు.