‘నా తల్లిని అవమానిస్తే మాట్లాడకూడదా’..లోకేష్ ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా నేడు రసాభాస జరిగింది. వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు రావడం లేదని టీడీపీ మంత్రి లోకేష్ ప్రశ్నించారు. తన తండ్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా శాసనసభకు వచ్చారన్నారు. ఈ సభ సాక్షిగా తన తల్లిని అవమానించిన తర్వాతే తండ్రి చంద్రబాబు ప్రతిజ్ఞ చేసి వెళ్లిపోయారని లోకేష్ మండిపడ్డారు. తన తల్లిని అవమానిస్తే తాను మాట్లాడకుండా ఎలా ఉంటానని, పైగా ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వైసీపీ సభ్యులు, జగన్ ఎందుకు సభకు రావడం లేదన్నారు.

