విజయసాయి నోట… ఇంకా అదే పాట
వైసీపీ నాయకులకు ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా వారు మాత్రం పద్దతి మాత్రం మార్చుకోవడం లేదు. రాజధాని విషయంలో మరో మాటకు తావు లేదని… విశాఖను పరిపాలన రాజధానిగా మార్చితీరుతామంటూ మరోసారి స్పష్టం చేశారు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. ఎవరు ఔనన్నా.. కాదన్నా విశాఖపట్నం.. ఏపీకి పరిపాలన రాజధాని అవుతోందని ఆయన తేల్చి చెప్పారు. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి లభించింది తాత్కాలిక ఊరట మాత్రమేనని… పంట కాల్వ ఆక్రమించినందుకు చట్టపరంగా శిక్ష తప్పదన్నారు సాయిరెడ్డి.