Home Page SliderNationalNews Alert

సంజయ్‌ రౌత్‌ను పార్లమెంటరీ నేతగా తొలగించిన షిండే

మహారాష్ట్రలో ఉద్ధవ్‌ థాక్రే వర్గానికి సీఎం ఏక్‌నాథ్‌ షిండే వరుస షాక్‌లు ఇస్తున్నారు.  శివసేన పార్లమెంటరీ పార్టీ లీడర్‌గా ఉద్ధవ్‌ ముఖ్య అనుచరుడు సంజయ్‌ రౌత్‌ను షిండే తొలగించారు. ఆయన స్థానంలో లోక్‌ సభ ఎంపీ గజానన్‌ కీర్తికర్‌ను నియమించారు. ఈ మేరకు షిండే లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్‌ జగ్దీప్‌ ధన్కర్‌కు లేఖ రాశారు. గత ఏడాది శివసేనను షిండే పార్టీని చీల్చి బీజేపీ అండతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సీఎం పీఠాన్ని దక్కించుకున్నారు. ఆ తర్వాత శివసేన పార్టీని చట్టబద్ధంగా తన చేతుల్లోకి తీసుకున్నారు. షిండే నేతృత్వంలోని శివసేనే అసలైన శివసేన అని కేంద్ర ఎన్నికల సంఘం గత నెలలో స్పష్టం చేసింది. ఉద్ధవ్‌ థాక్రే వర్గానికి మరో పార్టీ పేరును, గుర్తును కేటాయించింది.