Home Page SliderInternational

ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన శీతల్ ఆర్మ్‌లెస్ షాట్..

భారత్‌కు చెందిన ఆర్మ్‌లెస్ ఆర్చర్ శీతల్ ప్రదర్శన ప్రపంచాన్నే అశ్చర్యపరిచింది. పారాలింపిక్స్‌లో ఆమె షాట్‌కు ఫిదా అయ్యారు. చేతులు లేకపోయినా కేవలం కాళ్లతో ధనుస్సును పట్టి పైకెత్తి తొలిషాట్‌లోనే 10 పాయింట్లను ఒడిసిపట్టింది. కొద్దిలో పతకం మిస్సయినా ప్రపంచ ప్రజల అభిమానాన్ని గెలుచుకున్నారు 17 ఏళ్ల శీతల్. ప్రత్యర్థి చేతులతో బాణం వేయగా, శీతల్ చేతులు లేని కారణంగా కాళ్లతో పోటీ పడ్డారు. ఈ వీడియోను కేంద్ర రక్షణ శాఖ మాజీ కార్యదర్శి శేఖర్ దత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై భారతీయ ప్రముఖులే కాకుండా విదేశాల నుండి ఎందరో ప్రశంసలు కురిపించారు. పారాలింపిక్స్‌లో పాల్గొనే ప్రతీ ఒక్కరూ అద్భుతమే అని, వైకల్యాన్ని అధిగమించి టాలెంట్‌ను నిరూపించుకున్నారని కామెంట్లు పెడుతున్నారు.