తాడేపల్లి గూడెంలో షర్మిల వినూత్న నిరసన
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తాడేపల్లి గూడెంలో రైతులతో కలిసి వినూత్న నిరసన చేపట్టింది. వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాడేపల్లి గూడెంలోని నందమూరు గ్రామంలో నీట మునిగిన పంటపొలాలలో నడుం లోతు నీళ్లలో దిగారు. రైతులతో కలిసి పంటను పరిశీలించారు. రైతులకు తగిన నష్టపరిహారం ఇవ్వాలని, వారిని సకాలంలో ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అన్నం పెట్టే రైతన్నకు రుణమాఫీలు చేయాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. షర్మిల నడుంలోతు నీళ్లలో దిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


 
							 
							