ఏపీ రైతులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి అంబటి
ఏపీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ..కృష్ణా జలాలపై న్యాయపోరాటానికి దిగుతామని తెలిపారు. కృష్ణా జలాలపై ఉన్న అడ్డంకులను కేంద్రం వెంటనే తొలగించాలని అంబటి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ కృష్ణా జలాలపై త్వరలోనే సుప్రీంను ఆశ్రయించి తమ వాదనలు వినిపిస్తామని అంబటి స్పష్టం చేశారు. కాగా సుప్రీంలో SLP వేసి న్యాయపోరాటం చేస్తామన్నారు. కృష్ణా జలాలపై కొత్త విధి విధానాలు రూపొందించడానికి మేము ఒప్పుకోమని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా కృష్ణా జలాల నుంచి ఏపీకి రావాల్సిన ఒక్క నీటి బొట్టును కూడా వదులుకునేది లేదన్నారు.ఏపీ రైతులకు అన్యాయం జరగనివ్వం అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.