crimeHome Page SliderNationalNews Alertviral

ఎయిర్ హోస్టస్‌కు లైంగిక వేధింపులు..బుద్ది చెప్పిన ఎయిర్ లైన్స్..

 మద్యం తాగిన ఓ ప్రయాణికుడు విమానంలోని ఎయిర్ హోస్టెర్‌తో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఈ ప్రయాణికుడికి తగిన విధంగా బుద్ది చెప్పింది ఎయిర్‌లైన్స్ యాజమాన్యం. పోలీసుల వివరాల ప్రకారం.. ఓ ఇండిగో విమానం విమానం ఢిల్లీ నుండి మహారాష్ట్రలోని షిర్డీకి బయల్దేరింది. అయితే విమానంలోని ఓ ప్రయాణికుడు మద్యం తాగి ఫ్లైట్‌లోని ఎయిర్ హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను అసభ్యకరంగా తాకుతూ ఇబ్బందులకు గురిచేశాడు. ఆ ప్రయాణికుడి అసభ్యకర ప్రవర్తనతో విసిగిపోయిన ఎయిర్ హోస్టెస్ తన మేనేజర్‌కు సమాచారం అందించింది. దీంతో విమానం షిర్డీ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయిన వెంటనే ఆ మేనేజర్ భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. ఇక వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై ఎయిర్‌ లైన్స్‌ సంస్థ ఇండిగో స్పందించింది. “మే 2న ఢిల్లీ నుండి షిర్డీకి వెళ్లే 6E 6404 విమానంలో క్యాబిన్ సిబ్బంది పట్ల ఒక కస్టమర్ అసభ్యంగా ప్రవర్తించినట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది.  ఇండిగోలో, అందరికీ సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణాన్ని అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని, ప్రయాణికులకు ఏదైనా అసౌకర్యం కలిగి ఉంటే చింతిస్తున్నాము” అని ఎయిర్‌లైన్ ఓ ప్రకటనలో పేర్కొంది.