Andhra PradeshHome Page Slider

ఏడో తరగతి బాలికపై టెన్త్ విద్యార్థినుల దాడి..

అల్లూరి జిల్లా పాడేరులోని సెయింట్ ఆన్స్ స్కూల్ హాస్టల్లో ర్యాగింగ్ కలకలం చెలరేగింది. ఏడో తరగతి బాలికపై టెన్త్ విద్యార్థినులు దాడి చేశారు. ఈ వీడియో వైరలవడంతో విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. దాడికి పాల్పడిన ముగ్గురిని హాస్టల్ నుంచి ఇంటికి పంపేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.