NewsTelangana

కేసీఆర్‌ను ఓడించకుంటే నా జన్మకు అర్థం లేదు

Share with

కేసీఆర్ ప్రజల విశ్వాసం కోల్పోయారని… టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు బీజేపీ సీనియర్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఎన్నికలొస్తే కేసీఆర్‌ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేరన్నారు. కేసీఆర్‌పై గజ్వేల్ లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. గజ్వేల్‌లో పోటీకి రావాలని సవాల్ విసిరితే… బానిసలతో ప్రెస్‌మీట్లు పెట్టి తిట్టించడం మర్యాద పోగొట్టుకోవడమేనన్నారు. హుజూరాబాద్‌లో మళ్లీ గెలవనని టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు… కేసీఆర్‌ దమ్ముంటే పోటీకి రావాలని ఈటల సవాల్ విసిరారు. కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యమన్న ఈటల… లేకుంటే తన జన్మకు సార్థకత ఉండదన్నారు. ఒక ప్రాంతీయ పార్టీకి వందల కోట్ల డబ్బులు ఎక్కడ్నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు ఈటల. ఏపీ, యూపీ, కర్నాటక ఎన్నికలకు కేసీఆర్ డబ్బులు పంపించారన్నారు. 2018లో ఓడించేందుకు కేసీఆర్ కుట్రలు చేసినా.. హుజూరాబాద్ ప్రజలు దీవించారని…. ప్రజల ఆకాంక్షల కోసం కేసీఆర్ సర్కారుపై పోరాటం ఊపిరి ఉన్నంత వరకు ఆపబోనన్నారు.