అగ్నివీరులకు అండగా ఆనంద్ మహింద్రా
దేశ వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్నా… ఆర్మీ మాత్రం అగ్నిపథ్ కొనసాగుతుందని తేల్చి చెప్పింది. ఈ తరుణంలో అగ్నివీరుల కోసం ఓ సూపర్ ఆఫర్ ప్రకటించారు టెక్ దిగ్గజం ఆనంద్ మహింద్రా… దేశ వ్యాప్తంగా బిజినెస్ కార్పొరేట్స్ అందరూ దీనిపై దృష్టిసారించాలన్నారు. అగ్నిపథ్ ఆందోళనలు బాధ కలిగించాయని… అగ్నిపథ్ కింద శిక్షణ తీసుకున్నవారు మెరికల్లా తీర్చిదిద్దబడతారని… వారికి సమాజంలో ఎన్నో గొప్ప గొప్ప అవకాశాలు లభిస్తాయన్నారు. అగ్నిపథ్ కార్యక్రమం చుట్టూ జరుగుతున్న హింసాకాండపై ఆయన విచారం వ్యక్తం చేశారు. అగ్నివీర్స్ క్రమశిక్షణ, నైపుణ్యాల కలయిక మెరుగైన ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయని… ఈ విషయాన్ని ఈ కార్యక్రమం ప్రారంభించాలనుకున్నప్పుడే స్పష్టం చేశానని గుర్తు చేశారు మహింద్రా. శిక్షణ పొందిన అగ్నివీరుల్లో సమర్థులైన యువకులను రిక్రూట్ చేసుకునేందుకు మహింద్రా గ్రూప్ సిద్ధంగా ఉందన్నారు. కార్పోరేట్ సెక్టార్‌లో అగ్నివీర్ల ఉపాధికి ఎన్నో అవకాశాలున్నాయన్న ఆనంద్ మహింద్రా… లీడర్ షిప్ క్వాలిటీస్… నాయకత్వం, సమష్టి కృషి, శారీరక దారుఢ్యం, శిక్షణ కారణంగా… అగ్నివీర్‌లు పరిశ్రమవర్గాలకు ఎంతగానో ఉపకరిస్తారన్నారు. దేశ వ్యాప్తంగా అగ్నివీరులకు ఎన్నో అవకాశాలు ఉంటాయన్నారు.