Home Page SliderNews AlertPoliticsTelanganatelangana,

ఓబుళాపురం మైనింగ్ కేసులో సంచలన తీర్పు

15 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో 7గురు నిందితులలో ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా తేల్చింది. ప్రధాన నిందితులైన గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్ రెడ్డి, మెఫజ్ ఆలీఖాన్, గనుల శాఖలో అప్పటి డైరెక్టర్ వీడీ రాజగోపాల్‌ను దోషులుగా నిర్థారిస్తూ శిక్ష ఖరారు చేసింది. అత్యధికంగా వీడీ రాజగోపాల్‌కు ప్రభుత్వ అధికారిగా ఉంటూ అక్రమాలకు పాల్పడినందుకు మొత్తంగా 11 ఏళ్ల పాటు శిక్ష విధించింది. మిగిలిన నలుగురికి ఏడేళ్ల శిక్షను విధించింది. ఈ శిక్షతో పాటు నిందితులందరూ రూ.10 వేల జరిమానాను చెల్లించాలని ఆదేశించింది. మైనింగ్ కంపెనీకి రూ.2 లక్షల జరిమానా విధించింది. అప్పటి గనుల శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డిని, పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందంను నిర్దోషులుగా ప్రకటించింది.  అప్పటి ఐఏఎస్ ఆఫీసర్స్  శ్రీలక్ష్మిని, కృపానందంలను 2022లోనే కేసు నుండి డిశ్చార్జ్  చేసింది.