ఈ నెల 5 నుండి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక: మంత్రి
TG: ఈ నెల 5 నుండి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 15 రోజుల్లో గ్రామ కమిటీల ద్వారా ఎంపిక పూర్తి చేస్తామన్నారు. ఇళ్ల నిర్మాణంలో ఎటువంటి డిజైన్లు ఉండవని, ప్లైన్ గోడలతో, లబ్ధిదారుల ఇష్టం మేరకు నిర్మించుకోవచ్చన్నారు. కనీసం 400 చ.అడుగులకు తగ్గకుండా ఇల్లు నిర్మించుకోవాలని, తప్పనిసరిగా కిచెన్, బాత్రూం ఉండాలని మీడియా చిట్ చాట్‌లో పేర్కొన్నారు.

