యోగికి బెదిరింపులు.. పోలీసుల వలలో చిక్కిన మహిళ
UP ముఖ్యమంత్రి యోగీని హత్య చేస్తామంటూ బెదిరింపు సందేశాలు పంపిన మహిళను మహారాష్ట్ర యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. థానేలోని ఉల్హాస్‌నగర్‌కు చెందిన ఫాతిమా ఖాన్ ఈ బెదిరింపు సందేశాలు పంపినట్టు గుర్తించి ఆమెను స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే ఆమె మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు పోలీసులు తెలిపారు. తదుపరి విచారణ, పరీక్షల నిమిత్తం ఆమెను ముంబైకి తరలించారు.