పుష్పపై మండిపడ్డ సీతక్క
పుష్ప చిత్రంపై తెలంగాణ మంత్రులు ఇంకా కారాలు, మిరియాలు నూరుతున్నారు. మంత్రి సీతక్క ఈ చిత్రానికి జాతీయ అవార్డు రావడంపై మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ పుష్ప చిత్రంలో హీరో స్మగ్లర్‌గా , పోలీసును విలన్‌గా చూపించారు. ఒక స్మగ్లర్ పోలీసుల దుస్తులు విప్పి నిలబెడితే దానికి జాతీయ అవార్డు ఇవ్వడం దేనికి సంకేతమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి నేరప్రవృత్తి గల సినిమాలకు ప్రోత్సాహకాలు ఇచ్చేది లేదంటూ మండిపడ్డారు. జైభీమ్ లాంటి సినిమాలకు అవార్డులు, రివార్డులు లేవు. వాటికి కలెక్షన్లు కూడా ఇలా వందల కోట్లు రావు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇటీవల పుష్ప 2 చిత్రం బెనిఫిట్ షో సందర్భంగా హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు రావడంతో భారీ తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో ఉన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్ అయ్యింది. హీరో అల్లు అర్జున్ అరెస్టై, జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదల అయ్యారు..

