సీతక్కకు తృటిలో తప్పిన పెను ప్రమాదం
ములుగు ఎంఎల్ఎ సీతక్క గోదావరి నది పరివాహక ప్రాంతంలో ముంపుకు గురైన ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఈ రోజు ఏటూరు నాగారం మండలం ఎలిశెట్టిపల్లిలోని వరద బాధితులను సందర్శించారు. అదే విధంగా సీతక్క అక్కడ ఉన్న వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తిరుగు ప్రయాణంలో ఆమె ప్రయాణిస్తున్న పడవలో పెట్రోల్ అయిపోయింది. దాంతో ఆ పడవ అదుపు తప్పి ఒక చెట్టును ఢీ కొట్టింది.అయినప్పటికీ సీతక్క పడవ నుండి దిగి క్షేమంగా బయటకు వచ్చారు.దీంతో అక్కడి వారందరూ ఊపిరి పీల్చుకున్నారు.