InternationalNews

రిషిని తప్ప ఇంకెవరినైనా ఎన్నుకోండి…

Share with

బ్రిటన్ ప్రధాని ఎన్నికలో భారత సంతతికి చెందిన రిషి సునక్ ప్రధాని రేసులో దూసుకుపోతున్న విషయం తేలిసిందే. ప్రధాని పదవి కోసం రిషి సునాక్‌, పెన్ని మార్డౌట్‌తో సహ మరో ఐదుగురి మధ్య పోటీ కొనసాగుతుంది.ఈ నేపథ్యంలో బ్రిటన్ తాత్కలిక ప్రధాని బోరిస్ జాన్సన్ రిషి సునక్‌ను ఎలాగైన ఓటమి పాలు చేయాలని అంతర్గతంగా ప్రచారం చేస్తున్నట్టు సమాచారం. పరోక్షంగా రిషి సునాక్ ను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పకనే చెప్పారు. రిషి తనకు ద్రోహం చేశారని,ఆయన కారణంగానే సొంత పార్టి నేతలు కూడా తనకు దూరమయ్యారని బోరిస్ అగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. రిషిని తప్ప ఇంకెవరినైనా ఎన్నుకోండని మద్దతుదారులతో జాన్సన్ మంతనాలు సాగిస్తున్నారు. లిజ్ ట్ర‌స్, పెన్నీ మొర్డాంట్ అభ్య‌ర్థిత్వాల పట్ల బోరిస్‌ జాన్సన్‌ చాలా ఆస‌క్తిగా ఉన్నార‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి.

Read More: వారం రోజుల్లో శ్రీలంకకు కొత్త అధ్యక్షుడు