భారీ వర్షాలతో పంజాబ్‌లో స్కూళ్లకు సెలవులు
ఉత్తర భారతదేశాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ భారీ వర్షాలతో యమునా,బియాస్ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. ఇందులో ముఖ్యంగా ఢిల్లీ వరదలతో నీట మునిగింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. అయితే తాజాగా పంజాబ్ ప్రభుత్వం కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా పంజాబ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 13 వరకు పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే రాష్ట్రంలోని రూప్‌నగర్,పాటియాలా,మొహాలీకి IMD రెడ్ అలర్ట్ జారీ చేయడంతో సీఎం భగవంత్ మాన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.

