తెలంగాణలో మరో 4 రోజుల పాటు వర్షాలు
కొన్ని రోజుల విరామం తర్వాత తెలంగాణలో మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. రుతుపవనాల ప్రభావంతో వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్,సంగారెడ్డి,మెదక్ సహా పలు ప్రాంతాలలో భారీ వర్షపాతం నమోదయ్యింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో నాలుగు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆదిలాబాద్,కుమ్రంభీం,ఆసిఫాబాద్,జగిత్యాల,రాజన్న,సిరిసిల్ల,కరీంనగర్,పెద్దపల్లి జయశంకర్,భూపాలపల్లి,ములుగు,వరంగల్,హనుమకొండ,జిల్లాల్లోని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతవరణ శాఖ హెచ్చరించింది.ఇటీవల కురిసిన వర్షాలు సృష్టించిన విలయం నుంచి తేరుకోక ముందే మళ్లీ వానలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.పంటలు దెబ్బతిన్నాయి,ముంపు నీరు ఇండ్లను ముంచెత్తింది.పలు ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోయాయి.ఆ కష్టాల నుంచి బయటపడక ముందే మళ్లీ వర్షాలు కురుస్తోండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.