Andhra PradeshHome Page Slider

సర్వమతం.. కోరెను బాబు హితం

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా, క్షేమంగా ఉండటంతో పాటు, అక్రమ అరెస్టు నుంచి వెంటనే విడుదలై ప్రజలలోకి రావాలని కోరుతూ శ్రేణులు జిల్లావ్యాప్తంగా మంగళవారం ప్రార్థనలు చేశారు.

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా, క్షేమంగా ఉండటంతో పాటు, అక్రమ అరెస్టు నుంచి వెంటనే విడుదలై ప్రజలలోకి రావాలని కోరుతూ శ్రేణులు జిల్లావ్యాప్తంగా మంగళవారం ప్రార్థనలు చేశారు. దేవాలయాల్లో పూజలు చేశారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. మసీదుల్లో దువా చదివారు. చర్చిల్లో పాస్టర్లతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నియోజకవర్గ ముఖ్య పట్టణాల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో సామూహిక రిలే నిరాహార దీక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ.. వైకాపా అరాచకాలకు రాష్ట్రంలోని ప్రజలు విసిగివేసారి పోయారని చెప్పారు. జగన్ అసమర్థ పాలనకు త్వరలోనే ముగింపు పలకనున్నారని ఉద్ఘాటించారు.