బాబు పవన్ భేటి వల్ల ఒరిగేదేం లేదు: సజ్జల
ఏపీ రాజకీయాలలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామాకృష్ణారెడ్డి స్పందించారు. ఇటీవల జరిగిన బాబు,పవన్ భేటిపై ఆయన సంచలన కామెంట్స్ చేశారు. ఏపీలో బాబు,పవన్ భేటి వల్ల ఒరిగేదేమి లేదన్నారు.

బాబు వ్యతిరేక ఓటును చీల్చేందుకే..పవన్‌ను పావులా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. నటుడిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు భ్రమపడుతున్నారని తెలిపారు. దీనికి పవన్ తన అభిమానాన్ని తాకట్టు పెడుతున్నారన్నారు. పైగా పవన్ బూతులు కూడా మాట్లాడుతున్నారన్నారు. తాము రియాక్ట్ అయితే తట్టుకోలేరని సజ్జల వ్యాఖ్యానించారు. ఏపీలో ఎన్నికలకు ముందే వికేంద్రికరణ పూర్తి చేయాలన్నారు. ఎలాగైనా ఏపీ సీఎం అవ్వాలనే చంద్రబాబు ఇదంతా చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. ప్రస్తుతం చంద్రబాబు ఆశ,ఆశయం జగన్‌ను గద్దె దించడమేనని సజ్జల పేర్కొన్నారు. కాగా సీఎం పదవి దక్కించుకోవడం కోసం చంద్ర ఏమైనా చేస్తారని సజ్జల ఆరోపించారు.

