ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ఆర్టీఏకు భారీ ఆదాయం
ఆర్టీఏ సెంట్రల్ జోన్ ఖైరతాబాద్ ఆఫీసులో నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలం ఆర్టీఏకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. టీజీ 09బీ 9999 అనే నంబర్ ఏకంగా రూ.20,01,111 పలికింది. లాట్ మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. అలాగే టీజీ 09సీ0001 నంబరును యాడ్ స్టోర్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.10,27,777కు దక్కించుకుంది. అదే సిరీస్ లోని 0006ను రూ.3,85,000కు పోరుస్ ఆగ్రో ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, 0009ను రూ.2,75,000కు దండు ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సొంతం చేసుకున్నాయి. 0007 నంబరును రూ.1.77,777కు వేంపాటి సుబ్బాయమ్మ, టీజీ 09బీ 9909ను రూ.1,35,000కు మేధావి స్ట్రాన్ ప్రైవేట్ లిమిటెడ్, టీజీ 09 సీ0005 నంబరును రూ.1,13,000కు గణేశ్ కుమార్ మామిడిపల్లి, టీజీ09సీ0011 నంబరును రూ.1,04,999కు జీపీ ఆర్ మాల్ అండ్ మల్టీప్లెక్స్ నిర్వాహకులు సొంతం చేసుకున్నారు.

