ఏసీ కారులో ఓటర్లను తిప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఎనిమిదేళ్లు గా ప్రజా సమస్యలను పట్టించుకోని సీఎం కేసీఆర్.. మునుగోడు ఉప ఎన్నికకు మంత్రులు, ఎమ్మెల్యేలను మొత్తం 88 మందిని పంపడం ద్వారా పరో క్షంగా ఓటమిని ఒప్పుకున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. ప్రవీణ్‌కుమార్ మునుగోడు మండలం కొంపల్లి, చల్మెడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ రోజు కూడా ఫామ్ హౌజ్‌ను వదిలి బయటకురాని సీఎం కేసీఆర్ .. నేడు కేవలం ఒక ఎంపీటీసీ పరిధిని ఎంచుకొని ప్రచారం చేయడం ఆయన అసమర్థ పాలనకు నిదర్శనమని విమర్శించారు. వెల్మకన్నె గ్రామానికి ప్రచారానికి వెళ్లి మహిళలతో మాట్లాడారు. మాటల సందర్భంలో తాము ఎప్పుడూ ఏసీ కారులో తిరగలేదని ఆ మహిళలు చెప్పడంతో ప్రవీణ్‌కుమార్ వారిని కారులో ఎక్కించుకుని కాసేపు తిప్పారు.