NationalNews

డ్రైవర్‌కు 15 లక్షల సాయం.. విద్యార్థినికి అల్లు అర్జున్‌ ఆర్థిక భరోసా

పాన్‌ ఇండియా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మరోసారి దాతృత్వం చాటుకున్నారు. ఎవరైనా సాయం కోరితే..  వారికి సాయం చేయడానికి ఆయన ముందుంటారు. తన వద్ద పని చేసే సిబ్బందికి ఆయన అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు.  అల్లు అర్జున్‌ వద్ద హైదరాబాద్‌లోని బోరబండకు చెందిన మహిపాల్‌ గత పదేళ్లుగా డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే.. ఇటీవలే మహిపాల్‌ బోరబండలో సొంత ఇంటిని నిర్మించుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్‌ తన డ్రైవర్‌కు 15 లక్షల రూపాయాలను అందించి సాయం చేశారు. దీంతో మహిపాల్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

మరోవైపు… కేరళలోని అలెప్పీకి చెందిన ఓ విద్యార్థినికి ఆర్థిక భరోసానిచ్చారు అల్లు అర్జున్‌. తండ్రిని పోగొట్టుకుని, ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్న ఆ మెరిట్‌ స్టూడెంట్‌ ఉన్నత చదువులకు అయ్యే ఖర్చంతా అల్లు అర్జున్‌ భరించనున్నారు. ఆ వివరాలను ఇప్పటి వరకు గోప్యంగా ఉంచారు. అలెప్పీ కలెక్టర్‌ కృష్ణతేజ పోస్ట్‌తో ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈ వార్తను చూసిన ఫ్యాన్స్‌, నెటిజన్లు అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విద్యార్థిని హాస్టల్‌ ఫీజుతో సహా అన్నింటినీ అర్జున్‌ భరిస్తానన్నారు. స్టూడెంట్‌ భవిష్యత్తు కోసం ముందుకొచ్చిన అల్లు అర్జున్‌, థామస్‌ కాలేజీ యాజమాన్యానికి అలెప్పీ కలెక్టర్‌ కృష్ణ తేజ ధన్యవాదాలు తెలిపారు.