Andhra PradeshHome Page Slider

అసెంబ్లీలో రోజా షాకింగ్ కామెంట్స్

ఏపీ అసెంబ్లీలో అటు వైసీపీ, ఇటు టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్. ఇవాళ అసెంబ్లీలో ఇరు పార్టీల ఎమ్మెల్యేలు బాహాబాహీకి దిగగా… చంద్రబాబు తీరుపై మండిపడ్డారు మంత్రి రోజా. బీసీలంటే చంద్రబాబుకు చులకనన్నారు. బీసీలు జడ్జీలుగా పనికిరారని నాడు లెటర్ రాశాసి వ్యక్తి చంద్రబాబు అని, బీసీలకు తోకలు కత్తిరిస్తానన్న ఘనడు చంద్రబాబు అని రోజా మండిపడ్డారు. సీకర్‌గా తమ్మనేని సీతారాం ఎన్నికైతే.. కనీసం చెయిర్‌లో కూర్చోబెట్టేందుకు కూడా రాలేదన్నారు. బీసీ స్పీకర్‌ను సహించలేకే ప్రతి రోజూ ఎమ్మెల్యేలతో పేపర్లు చించి, మీద జల్లుతున్నారన్నారు. స్పీకర్ మంచోడు కాబట్టే ఓపిగ్గా ఉన్నారన్నారు. లేకుంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు.

టీడీపీ నేతల తీరును ప్రజలు ఆసహ్యించుకుంటున్నారన్నారు మంత్రి రోజా. ఎమ్మెల్యేలు ఎవరైనా, పోడియం వద్దకు వచ్చి ఇలాంటి కార్కక్రమాలు చేయాలంటే… భయం పుట్టే విధంగా, మీ దగ్గరకు రావాలంటేనే భయం కలిగేలా పనిష్మెంట్ ఇవ్వాలని ఆమె కోరారు. స్పీకర్ చైర్‌ను అగౌరవపరిచేవారిని శాశ్వతం చట్టసభలకు రాకుండా చేయాలన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఎస్సీ ఎమ్మెల్యేపై దాడులకు దిగడం దారుణమన్నారు. స్పీకర్‌ను అవమానించి… ఎస్సీ ఎమ్మెల్యే సుధాకర్, డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని బూతులు తిట్టారన్నారు. అసెంబ్లీలో లోపలు అరాచకం చేసి… మీడియా ముందు నీతులు మాట్లాడుతున్నారని… ఇది ఎమ్మెల్యే బాలవీరాంజనేయులకు తగినది కాదన్నారు. చట్టసభలో నిస్సుగ్గుగా వ్యవహరించింది కాక… బయటకు వెళ్లి అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు.