భారతీయులకు కొత్త వీసాలు మంజూరుకు రిషి సునక్ గ్రీన్ సిగ్నల్
రిషి సునక్ ప్రధానిని కలిసిన కొన్ని గంటల తర్వాత భారతీయుల కోసం పెద్ద వీసా పథకాన్ని UK క్లియర్ చేసింది. G20 సమ్మిట్ 17వ ఎడిషన్ సందర్భంగా సునక్ ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన కొన్ని గంటల తర్వాత ఈ ప్రకటన వెలువడింది. UK ప్రధాన మంత్రి రిషి సునక్ ప్రతి సంవత్సరం UK లో పని చేయడానికి భారతదేశం నుండి యువ నిపుణుల కోసం 3,000 వీసాలకు అనుమతి ఇచ్చారు. గత ఏడాది అంగీకరించిన UK-ఇండియా మైగ్రేషన్, మొబిలిటీ భాగస్వామ్య బలాన్ని హైలైట్ చేస్తూ, ఇటువంటి పథకం నుండి ప్రయోజనం పొందిన దేశం భారతదేశం అని బ్రిటిష్ ప్రభుత్వం పేర్కొంది. ఈ రోజు UK-ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ ధృవీకరించబడింది, 18-30 ఏళ్ల డిగ్రీ-విద్యావంతులైన భారతీయ పౌరులు రెండు సంవత్సరాల వరకు జీవించడానికి మరియు పని చేయడానికి UKకి రావడానికి 3,000 వీసాలను పొందనున్నారని UK ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.
డౌనింగ్ స్ట్రీట్ రీడౌట్లో ఈ ప్రకటన G20 సమ్మిట్ 17వ ఎడిషన్ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసిన కొన్ని గంటల తర్వాత వచ్చింది. గత నెలలో మొదటి భారతీయ సంతతికి చెందిన బ్రిటీష్ ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇద్దరి తొలి సమావేశం ఇదే. బాలీలో @g20 సమ్మిట్ మొదటి రోజు సందర్భంగా ప్రధానమంత్రులు మోదీ, రిషి సునక్ కీలక చర్చలు జరిపారని ప్రధాని కార్యాలయం ట్వీట్లో తెలిపింది. UK-ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ కింద, బ్రిటన్లో రెండేళ్ల పాటు నివసించడానికి, పని చేయడానికి UKకి రావడానికి 18-30 ఏళ్ల వయస్సు గల పట్టభద్రులైన విద్యావంతులైన భారతీయ పౌరులకు సంవత్సరానికి 3,000 వీసాలను అందిస్తారు. ఈ పథకం భారతదేశంతో మా ద్వైపాక్షిక సంబంధాలకు, రెండు ఆర్థిక వ్యవస్థల బలోపేతంతోపాటు… ఇండో-పసిఫిక్ ప్రాంతంతో బలమైన సంబంధాలను ఏర్పరచడానికి సహకరిస్తోందని డౌనింగ్ స్ట్రీట్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని దాదాపు అన్ని దేశాల కంటే బ్రిటన్కు భారత్తో ఎక్కువ సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. UKలోని అంతర్జాతీయ విద్యార్థులలో దాదాపు నాలుగింట ఒక వంతు మంది భారతదేశానికి చెందినవారే ఉన్నారు. UKలో భారతీయ పెట్టుబడిలు, ఆదేశంలో 95,000 ఉద్యోగాల పొందేలా చేస్తుంది. ప్రస్తుతం భారతదేశంతో వాణిజ్య ఒప్పందంపై యూకే చర్చలు జరుపుతోంది. ఒకవేళ అవి సఫలమైతే… భారతదేశం, ఒక యూరోపియన్ దేశంతో చేసుకున్న మొదటి ఒప్పందం అవుతుంది. రెండు దేశాల వాణిజ్య ఒప్పందం విలువ 24 బిలియన్ పౌండ్లు. ఓవైపు కొత్త వీసాలు ఇస్తూనే.. ఇమ్మిగ్రేషన్ నేరస్థులను వెనక్కి పంపించే పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని బ్రిటన్ పేర్కొంది.

