ఆంధ్రప్రదేశ్ వరదల్లో నష్టంపై రెవిన్యూ శాఖ ప్రకటన
ఆంధ్రప్రదేశ్ వరదల కారణంగా మొత్తం 179 మండలాలు, 819 గ్రామాలు ఎఫెక్ట్ అయ్యాయి. 422 గ్రామాలు మునగగా, 25 పట్టణాలు, 142 వార్డులు ముంపునకు గురయ్యాయి. మొత్తం 11 లక్షల 90 వేల 76 మంది పీడనకు గురయ్యారు. 99,905 గృహాలు ముంపునకు గురి కాగా ఆయా కుటుంబాలకు 193 కోట్ల 82 లక్షల 10 వేల రూపాయలు సాయమందించారు. ఇక రిలీఫ్ క్యాంప్ సహాయం కోసం మొత్తం 534 కోట్ల, 49 లక్షల 46 వేల 131 రూపాయలు వ్యయం చేశారు. ఇక బాధితులను ఖాళీ చేసేందుకు 10 కోట్ల 37 లక్షల 22 వేల 204 రూపాయలు ఖర్చు చేశారు. ఐతే క్యాండిల్స్ కోసమే పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేశారంటూ సీపీఎం నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలుగుప్పిస్తున్నారు. కానీ అదంతా ఫేక్ అంటోంది టీడీపీ సర్కార్.

