ఉక్కు మనిషికి రేవంత్ నివాళులు
భారత దేశ తొలి ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతిని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ లో ఆ మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. దేశంలో ఉన్న 108 సంస్థానాలను విలీనం చేసి జాతి మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిన ఏకీకృత శక్తి పటేల్ అన్నారు.స్వాతంత్య్రం సాధించినప్పటికీ హైద్రాబాద్ లాంటి సంస్థానాల సంలీనం అపరీష్కృతంగా ఉండేదని,కానీ పటేల్ చొరవతో సంస్థానాలన్నీ విలీనం అయ్యాయని గుర్తు చేశారు. నివాళులు అర్పించిన వారిలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , కొండా సురేఖ , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు.

