Home Page SliderNational

క్యాండీక్రష్ ఆడుతున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి…చెడుగుడు ఆడుకున్న బీజేపీ

Share with

ఎన్నికల వేళ వివిధ పార్టీల మధ్య వ్యంగ్యాస్త్రాలు మామూలే. ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కీలక సమావేశంలో క్యాండీక్రష్ ఆడుతూ బీజేపీ కెమెరాకు చిక్కారు. దీనితో వారు చెడుగుడు ఆడుకున్నారు. రాయపూర్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. రాబోయే ఎన్నికలలో అభ్యర్థుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో బఘేల్ వీడియో గేమ్ ఆడడంతో బీజేపీ పార్టీ ఈ ఫొటోను తమ ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఎలాంటి ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ గెలవదని తెలిసి, ముఖ్యమంత్రి క్యాండీక్రష్ ఆడుతూ  రిలాక్స్ అవుతున్నారంటూ కామెంట్ పెట్టింది. దీనికి భూపేశ్ కూడా అదే రీతిలో బదులిచ్చారు. అధికారంలో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో నిర్ణయించేది ప్రజలని జవాబిచ్చారు.  తాను సంప్రదాయ ఆటలు కూడా ఆడతానని, క్యాండీక్రష్ తన ఫేవరేట్ గేమ్ అని, అన్ని లెవల్స్ దాటేశానని, బీజేపీని కూడా ఎన్నికలలో ఆడుకుంటానని ఎద్దేవా చేశారు. కాగా ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు నవంబర్ 7, 17 తేదీల్లో రెండు విడతల్లో జరగనున్నాయి. 90 స్థానాలున్న ఈ రాష్ట్రంలో డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది.