ఏపీ భూమి ధరలపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఏపీలో భూమి ధరలపై తెలంగాణ ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు శిల్పకళావేదికలో కొత్త ఎంఎస్ఎంఈ పాలసీపై ఆయన సదస్సులో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని పేర్కొంటూ, పారిశ్రామిక వేత్తలకు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించారు. వారికి ఏపీ, తెలంగాణకు భూముల ధరలలో తేడాలు వివరించారు. గతంలో కృష్ణాజిల్లాలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో 100 ఎకరాలు కొనేవాళ్లమని, కానీ ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో వంద ఎకరాలు కొనొచ్చు అంటూ వ్యాఖ్యానించారు. పారిశ్రామిక వేత్తలకు తెలంగాణలో అన్ని సౌకర్యాలు కలిగిస్తాం అన్నారు. రైతుల కష్టాలు తీరడానికి రూ. 2లక్షల రుణమాఫీ చేశామని, కానీ వారి కష్టాలు తీరలేదన్నారు. ఒక కుటుంబంలో అందరూ వ్యవసాయంపై ఆధారపడకుండా, వేరే వృత్తులు కూడా చేపట్టాలన్నారు. ప్రభుత్వ నేతలను ఎవ్వరైనా, ఎప్పుడైనా కలవొచ్చు అన్నారు.