Home Page SliderInternationalSports

పాక్ కెప్టెన్ ఇంగ్లీష్ విని మూర్చపోయిన రిపోర్టర్

పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌ను ఇంటర్యూ చేసిన రిపోర్టర్ తల తిరిగిపోయింది. అతడి ఇంగ్లీష్ భాష విని మూర్చపోయినంత పనయ్యింది. ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కెప్టెన్ రిజ్వాన్ నేతృత్వంలోని పాక్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో గెలుపొందింది. కానీ రెండవ టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పాక్‌ను ఖంగుతినిపించింది. 2-0తో పాక్‌పై ఆధిక్యంలో ఉంది. రిజ్వాన్‌ను ఈ ఓటమిపై ఇంటర్యూ చేసిన రిపోర్టర్‌కు అతడు చెప్పేదేమీ అర్థం కాలేదు.  ఐసీసీ ఛాంపియన్స్ కోసం భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్‌కు వెళ్లడానికి నిరాకరించడంపై ప్రశ్నించిన రిపోర్టర్‌కు రిజ్వాన్ ఏం చెప్పాడో, ఏం చెప్పాలనుకుంటున్నడో అర్థం కాలేదట. ఈ వీడియోను భారత్ వ్యాపారవేత్త హర్ష గోయెంకా పోస్టు చేసి, రిజ్వాన్ చెప్పేది ఎవరికైనా అర్థమైతే చెప్పండంటూ కామెంట్ చేశారు.