NationalNewsNews Alert

ఢిల్లీలో క్రొత్త ఓమిక్రాన్ వేరియంట్ కలకలం

Share with

భారతదేశ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ..ఢిల్లీని మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉంది.ఈ మేరకు ఢిల్లీలో ప్రతిరోజు రెండు వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.దీంతో అక్కడి ప్రజలు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు.ఈ కేసులను పరీక్షించిన వైద్యులు మాత్రం ఇవి ఒమిక్రాన్ క్రొత్త వేరియంట్‌కు సంబంధించినవేనని అభిప్రాయపడుతున్నారు. ఇది కచ్చితంగా ఒమిక్రాన్ క్రొత్త వేరియంటేనని లోక్‌ నాయక్ జైప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రి అధికారులు స్పష్టం చేశారు.

ఇంకా కొంతమందిలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఉప వేరియంట్ బీఎ 2.75ను కూడా గుర్తించినట్లు మెడికల్ డైరెక్టర్ సురేష్ కుమార్ తెలిపారు.ఈ వేరియంట్ యాంటీబాడీలు తీసుకున్న వారితో సహా టీకాలు వేయించుకున్న వారిపై కూడా ప్రభావం చూపుతుందని డా.సురేష్  వెల్లడించారు. ఇప్పటికే అనుమానం ఉన్న దాదాపు 90 మంది నమూనాలను ల్యాబ్‌కి పంపగా..వారిలో ఒమిక్రాన్ ఉప వేరియంట్ బీఎ 2.75ను గుర్తించామన్నారు. కాబట్టి ముఖ్యంగా వృద్దులు,చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.