Andhra PradeshcrimeHome Page Slider

రూ.40 ల‌క్ష‌ల ఎర్ర చంద‌నం స్వాధీనం

తిరుపతి జిల్లా భాకరాపేట అటవీ ప్రాంతం లో అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న ఎర్రచంద‌నం దుంగ‌ల‌ను టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపుదాడి చేసి ప‌ట్టుకున్నారు. దేవరకొండ మెయిన్ రోడ్డు లో 32 ఎర్రనచందనం దుంగలు ఒక మోటార్ సైకిల్ మరో లగేజి వాహనం స్వాదీనం చేసుకొని ఇద్దరు స్మగ్లర్ లను అరెస్ట్ చేశారు.స‌మాచారం మేర‌కు దేవరకొండ వైపు గల అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు పోలీసులు. తుమ్మచేనుపల్లీ మట్టి రోడ్డు వద్ద కు చేరుకోగా మోటార్ సైకిల్ పై ఒక వ్యక్తి కనిపించాడు. ఆ వాహనాన్ని అనుసరించిన టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఒక లగేజి వాహనం కనిపించింది. ఆ వాహనాన్ని చుట్టు ముట్టడం తో అందులోని స్మగ్లర్లు పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని వెంబడించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని పట్టుకోగలిగారు. లగేజి వాహనం తనిఖీ చేయగా అందులో 32 ఎర్రచందనం దుంగలు లబించాయి. పట్టుబడిన వారిని ఉమ్మడి చిత్తూరు జిల్లా కు చెందిన వారుగా గుర్తించారు. ఎర్రచందనం దుంగలు తో సహ వారిని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ కు తరిలించారు. పట్టుబడిన ఎర్రచందనం దుంగలు విలువ రూ. 40 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.