రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన నడుస్తోంది..జగన్
ఏపీలో ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారని, ప్రజలకు ఆశ చూపించి పరిపాలన జరుగుతోందని మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన నడుస్తోందని, లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందని వైసీపీ నాయకుడు విమర్శలు కురిపిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి పథకాలు అమలు కావడం లేదని, తమ ప్రభుత్వ కాలంలో ఆర్థిక కష్టాలు ఉన్నా కూడా నవరత్నాలు అమలు చేశామన్నారు. చంద్రబాబు మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారని, ప్రభుత్వంపై ఆగ్రహం పెరిగుతోందని వ్యాఖ్యానించారు. మాడుగులలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల భేటీలో జగన్ పాల్గొన్నారు. వెలుగు తర్వాత చీకటి, చీకటి తర్వాత వెలుగు రావడం తథ్యం అని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలలో తప్పకుండా వైసీపీ పార్టీయే గెలుస్తుందని, తమ పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు.

