పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేయడానికి రెడీ: రాజాసింగ్
తెలంగాణ: మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీల అమలుకు నిధులు ఇటలీ నుండి తెస్తారో? కాంగ్రెస్ ఆఫీస్ నుండి తెస్తారో వేచి చూడాల్సి ఉందన్నారు. పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేయడానికి తాను సిద్ధమేనని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్‌ను పార్టీ నిర్ణయిస్తుందని, ఎవరికి బాధ్యతలు అప్పగించినా కలిసి పనిచేస్తామని తెలిపారు.

