ఆర్బీఐ కొత్త గవర్నర్ నియామకం..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత గవర్నర్ శక్తి కాంత దాసు రేపు రిటైర్ కాబోతున్నారు. ఈ సందర్భంగా కొత్త గవర్నర్‌గా ఐఏఎస్ ఆఫీసర్ సంజయ్ మల్హోత్రాను నియమించారు. ప్రస్తుతం ఆయన ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెవెన్యూ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. డిసెంబర్ 14వ తేదీ నుండి ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఆయనకు ఫైనాన్స్, టాక్సేషన్, ఐటీ, మైనింగ్ శాఖలలో పనిచేసిన విశేష అనుభవం ఉంది. సంజయ్ మల్హోత్రా ఐఐటీ కాన్పూర్ నుండి కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. అమెరికాలోని ప్రిన్‌స్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు.

