చట్నీలో ఎలుక.. నిజం కాదు: కాలేజీ ప్రిన్సిపాల్
టిజి: సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్ జెఎన్‌టీయూ కాలేజీ హాస్టల్ చట్నీలో ఎలుక పడడంపై ప్రిన్సిపల్ నరసింహ స్పందించారు. తినేందుకు తయారు చేసిన చట్నీలో ఎలుక పడలేదని, చట్నీ అయిపోయిన తరువాత ఇంకా శుభ్రం చేయని పాత్రలో పడిందని స్పష్టం చేశారు. అందులో ఎలుక పడడంతో కొందరు విద్యార్థులు వీడియో తీసి ప్రజా ప్రతినిధులకు పంపి వైరల్ చేసినట్లు ఆయన వివరించారు. కాగా నాణ్యమైన భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఆందోళనకు దిగారు.


 
							 
							