Home Page SliderNational

కొలువుదీరిన మహా ప్రభుత్వం.. సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణం

Share with

ఎట్టకేలకు మహారాష్ట్రలో ‘మహాయుతి’ ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. శివసేన అధినేత ఏక్ నాథ్ శిండే, ఎన్సీపీ అగ్రనాయకుడు అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ఇది మూడోసారి. ముంబయిలోని ఆజాద్ మైదాన్ లో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ సీపీ రాధా కృష్ణన్ వీరితో ప్రమాణం చేయించారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ సీఎంలు చంద్రబాబు నాయుడు, మోహన్ యాదవ్, యోగి ఆదిత్యనాథ్, భజన్ లాల్ శర్మ సహా ఎన్డీయే పాలిత రాష్ట్రాల నుంచి 19 మంది ముఖ్యమంత్రులు హాజరయ్యారు.