త్వరలో గుడ్ న్యూస్ చెప్పతాము అంటున్న రష్మిక….!
ఇటీవల చెన్నై జరిగిన పుష్ప 2 ప్రమోషన్ లో భాగంగా రష్మిక మాట్లాడుతూ హోస్ట్ అడిగిన ప్రశ్నలకు రష్మిక చెప్పినా మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . కొద్ది కాలంగా రష్మిక ,విజయ్ దేవరకొండ రిలేషన్‌షిప్ గురించి చాలా వార్తలు వస్తున్నాయి. తాజాగా రష్మిక పుష్ప 2 ప్రోమోషన్ లో మాట్లాడుతూ హోస్ట్ అడిగిన ప్రశ్నలకు తెలివిగా సమాధానం ఇచ్చింది . మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి సినీ ఇండస్ట్రీకి చెందినవారా కాదా?’ అని హోస్ట్ ప్రశ్నించగా.. ” ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు కోరుకున్న సమాధానం ఇదేనని నాకు తెలుసు’’ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. రష్మిక సమాధానం విని అభిమానులు అరుపులు, కేకలతో హోరెత్తించారు. పేరు చెప్పకుండా విజయ్ దేవరకొండతో బంధాన్ని ఆమె అంగీకరించిందని, ఈ వ్యాఖ్యలతో ఫుల్ క్లారిటీ వచ్చిందని ఫ్యాన్స్ అంటున్నారు. తాజాగా రష్మిక ,విజయ్ దేవరకొండ శ్రీలంకలోని ఓ ప్రదేశంలో లంచ్ చేస్తున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారాయి.

