మెగా ఇంట మొదలైన పెళ్లి బాజాలు
మెగా ఇంట్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి పెళ్లి బజాలు మొదలయ్యాయి.కాగా వీరిద్దరి ప్రీవెడ్డింగ్ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ మెగా వేడుకకు మెగా ఫ్యామిలీలోని కుటుంబ సభ్యులంతా హాజరయ్యి సందడి చేశారు. అయితే ఈ ప్రీవెడ్డింగ్ ఫోటోలను మెగా ఫ్యామిలీ సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అవి బాగా వైరల్ అవుతున్నాయి. ఈ ప్రీవెడ్డింగ్ వేడుకకు పవన్ కళ్యాణ్ బీజీ షెడ్యూల్ వల్ల హాజరు కాలేదని తెలుస్తోంది. అయితే ఇప్పటికే వరుణ్-లావణ్య జంట వివాహం కోసం షాపింగ్ చేసిన వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే వరుణ్-లావణ్యల పెళ్లి తేదిని ప్రకటిస్తారని సినీ వర్గాలు చెబుతున్నాయి.