Home Page SliderTelangana

ప్రముఖ కొరియోగ్రాఫర్‌పై అత్యాచార కేసు

ప్రముఖ కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్న జానీమాస్టర్‌పై అత్యాచార, లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. ప్రముఖ హీరోల చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా టాలీవుడ్, కోలీవుడ్‌లలో పేరుతెచ్చుకున్నారు జానీమాస్టర్. ఆయన తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నారని ఒక డ్యాన్సర్ హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనను గాయపరిచి, అత్యాచారం చేశారని ఆరోపించడంతో అతనిపై కేసు నమోదు చేశారు. ఆమె మధ్యప్రదేశ్‌కి చెందిన మహిళ అని, జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తోందని సమాచారం. తన అవకాశాలు కూడా అడ్డుకుంటున్నట్లు ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై ఇంకా జానీ మాస్టర్ స్పందించలేదు.