MLC ఎన్నికల్లో మొదటి ఆఫర్ నాకే, 10 కోట్ల కన్నా… నమ్మకమే మిన్నా…
టీడీపీ ఉండి ఎమ్మెల్యే రామరాజు మొదట వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన నా స్నేహితుడు కేఎస్‌ఎన్ రాజును సంప్రదించారన్నారు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. వారికి అనుకూలంగా ఓటు వేస్తే ఆదుకుంటామని హామీ ఇచ్చారన్నారు. తన స్నేహితుడు నిరాకరించడంతో రామరాజు నేరుగా నాకు ఫోన్ చేశారని చెప్పారు. ₹10 కోట్లు ఆఫర్ చేశారన్నారు. క్రాస్ ఓటు వేయడానికి నిరాకరించానని రాజోలు నియోజకవర్గం MLA రాపాక వరప్రసాద్ అన్నారు. కొన్ని గంటలకు ముందు నుండి వైరల్ గా మారిన తన వ్యాఖలు అంతర్వేదిలో జరిగిన వైఎస్సార్ సీపీ కార్యక్రమంలో మాట్లాడినట్టుగా వివరణ ఇచ్చారు.